ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ మస్తాన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-04 12:53:34  IST  )

ఏసీబీ వలకు విద్యుత్ ఏఈ మస్తాన్ చిక్కారు..

ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ మస్తాన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ(Acb) వలకి విద్యుత్ ఏఈ చిక్కారు. రైతు(Farmer)ను లంచం డిమాండ్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లా కారంపూడి(Karampudi)లో జరిగింది. ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ ఇచ్చి మీటర్ బిగించేందుకు షేక్ మస్తాన్ జానీ నుంచి విద్యుత్ ఏఈ కోటపెద మస్తాన్ రూ. 25 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు. ఈ మేరకు పక్కా పథకం ప్రకారం విద్యుత్ ఏఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాతే మాట్లాడుతూ విద్యుత్ ఏఈ మస్తాన్ పై గతంలోనూ అవినీతి ఆరోపణలున్నట్టు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచాలు ఇవ్వాలని బెదిరించిన యెడల 1064 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

Next Story