జగన్ పై ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు?

by Thanuru Gopichand |

ఎన్నికల ఓటు నిబంధనలను బేఖాతరు చేయడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసినట్లు సమాచారం.

జగన్ పై ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ఓటు నిబంధనలను బేఖాతరు చేయడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసినట్లు సమాచారం.ప్రస్తుతం గుంటూరు కృష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో కోడ్ అమల్లో ఉంది. అయితే గుంటూరు మిర్చి యార్డులో రైతులతో ముఖాముఖి నిర్వహించేందుకు నిన్న జగన్ గుంటూరు పరిస్థితి పర్యటనకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ సైతం జగన్ పర్యటనకు అనుమతించలేదు. అయినా మాట వినకుండా గుంటూరుకు చేరుకున్నారు. మిర్చియార్డులో రైతులతో మాట్లాడారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసేందుకు ఎన్నికల కమిషన్, పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Next Story