- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమానుషం.. మూడు రోజుల పాటు ముళ్లపొదల్లోనే వృద్ధురాలు
కన్నబిడ్డల అమానుషత్వానికి మూడు రోజులుగా ముళ్లపొదల్లోనే వృద్ధురాలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ దీనగాథ శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసింది...

దిశ, వెబ్ డెస్క్: కన్నబిడ్డల అమానుషత్వానికి మూడు రోజుల పాటు ముళ్లపొదల్లోనే వృద్ధురాలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ దీనగాథ శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసింది. మైలపిల్లి లక్ష్మి (60) అనే వృద్ధురాలిని ఆమె సంతానం పాలవలస రైల్వే పట్టాల పక్కన ఉన్న ముళ్లపొదల్లో వదిలేసి వెళ్ళిపోయారు. దీంతో ఆ వృద్ధురాలు మూడు రోజుల పాటు అన్నపానీయాలు లేక దీనావస్థలో అలమటించారు.
సురక్షితంగా బయటకు వృద్ధురాలు
అయితే ఆమెను గమనించిన ఓ గొర్రెల కాపరి.. స్థానికులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వృద్ధురాలి పరిస్థితిని తెలుసుకున్న 'సీతయ్య ఫౌండేషన్' ప్రతినిధులు వెంటనే అక్కడికి వెళ్లారు. ఆ వృద్ధురాలిని ముళ్లపొదల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్య సహాయాన్ని అందించారు. ప్రస్తుతం కోలుకున్న ఆ వృద్ధురాలికి ఆ ఫౌండేషన్ నిర్వాహకులు తమ వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో వృద్ధురాలు సంతానం వ్యవహరించిన అమానుషత్వంపై స్థానికులు విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పటికైనా కన్నతల్లి తమ బిడ్డలు ఆశ్రమం నుంచి తీసుకెళ్లి హ్యాపీగా చూసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆమె సంతానం స్పందిస్తుందేమో చూడాలి.






