మా భూమిని ఆక్రమించారు.. జోక్యం చేసుకోండి: పవన్‌కు వృద్ధ దంపతుల రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా వెల్దుర్తి గ్రామంలో వృద్ధ దంపతులకు ప్రభుత్వం కేటాయించిన భూమి ఆక్రమణకు గురవ్వడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

మా భూమిని ఆక్రమించారు.. జోక్యం చేసుకోండి: పవన్‌కు వృద్ధ దంపతుల రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) వెల్దుర్తి గ్రామం(Veldurthi Village)లో వృద్ధ దంపతుల(Elderly couple)కు ప్రభుత్వం కేటాయించిన భూమి ఆక్రమణకు గురవ్వడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ సహకారంతోనే తమ భూమిని ఇతరులు కబ్జా చేశారని బాధితులు వీర రాఘవులు, ఆయన కోడలు లక్ష్మీ ఆరోపించారు. కుమారుడు మరణించడంతో కోడలు, మనవరాళ్లతో కలిసి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నామని, నిలువ నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

పవన్ కల్యాణ్‌కు రిక్వెస్ట్

న్యాయం కోసం పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పందించి ఆక్రమణదారుల నుంచి తమ భూమిని ఇప్పించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story