బిడ్డ మృతదేహంతో ఎనిమిది కిలోమీటర్ల నడక

by Disha Web Desk 3 |
బిడ్డ మృతదేహంతో ఎనిమిది కిలోమీటర్ల నడక
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రెండు రోజుల క్రితం విశాఖ మన్యంలో అంబులెన్స్ వెళ్లే దారేలేక మార్గమధ్యంలోనే గర్భణి పురుడు పోసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే అల్లూరి సీతారామ రాజు జిల్లాలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన బాలుడి మృతదేహంతో తండ్రి ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామానికి చేరాల్సివచ్చింది.

రహదారి సౌకర్యం లేకపోవడంతో మృతదేహంతో ఎనిమిది కిలోమీటర్లు బంధువులు నడుచుకుంటూ వెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రోంపిల్లి పంచాయతీ చినకొనేల నుండి గుంటూరు వద్ద కొల్లూరులో ఇటుకల పనికి గిరిజన కుటుంబం వలస వెళ్లింది. అయితే సోమవారం సాయంత్రం అక్కడే అనారోగ్యంతో మూడేళ్ల బాలుడు మరణించాడు.

మృతదేహంతో పాటూ బంధువులను ఇటుక బట్టీ యజమాని రహదారి సదుపాయం వున్న విజయనగరం జిల్లా వనిజ వద్ద వదిలేసిన వెళ్లిపోయారు. అక్కడి నుండి సరైన రహదారి లేక ఎనిమిది కిలోమీటర్ల దూరం మృతదేహంతో నడుచుకుంటూ గ్రామానికి కుటుంబం, బంధువులు చేరుకోవాల్సి వచ్చింది. కాగా ఆ దురద్రుష్టకర సంఘటన పట్ల తీవ్ర నిరసన వ్యక్తమౌతుంది.

గిరిజన సబ్ ప్లాన్ నిధులను మళ్లించకుండా కనీస వసతులలో భాగంగా రహదారులను నిర్మిస్తే ఈ దుస్ధితి రాదని గిరిజన సంఘాలు మండి పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రహదారులను నిర్మించాలని, అంతవరకూ బైక్ అంబులెన్స్ లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని వనవాసీ హక్కుల సంఘం నేత వి. మోహన రావు డిమాండు చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed