- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలకు మనమివ్వగలిగే విలువైన ఆస్తి.. విద్య ఒక్కటే : సీఎం చంద్రబాబు
పిల్లలకు మనం ఇవ్వగలిగే విలువైన ఆస్తి విద్య ఒక్కటేనని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలకు మనం ఇవ్వగలిగే విలువైన ఆస్తి విద్య ఒక్కటేనని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం వెలగపూడిలోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన మెగా డీఎస్సీ విజేతలకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. 15,941 మంది డీఎస్సీ మెగా విజేతలు ఈ కార్యక్రమానికి హాజరవ్వగా.. వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 150 రోజుల్లో డీఎస్సీని పూర్తి చేసిన విద్యాశాఖమంత్రి నారా లోకేష్ అండ్ టీమ్ ను అభినందించారు. రాష్ట్రంలో మంత్రులందరి నుంచి ఇలాంటి పనితీరునే ఆశిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు డీఎస్సీని అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, అయినా డీఎస్సీని పూర్తిచేసి చూపించామన్నారు. సూపర్ సిక్స్ హామీలను కూడా సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే 2029 నాటికి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం.. పరిశ్రమలు వస్తే అభివృద్ది జరిగి సంపద సృష్టి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలన్నదే తన ప్రధాన లక్ష్యమన్న సీఎం.. పేదరికాన్ని అధిగమించాలంటే విద్య ఒక్కటే మార్గమని తెలిపారు. అందుకే ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేయాలని సూచించారు.






