- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
11 వేల బస్సులు నడుస్తున్నాయి.. డీజిల్ కొరత లేదు: ఈడీ రవి వర్మ క్లారిటీ
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో బంకుల వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో బంకుల వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక లీటర్ పెట్రోల్ కోసం గంటల తరబడి లైన్లో నిల్చుంటున్నారు. మళ్లీ దొరకదేమోనని కొందరైతే ట్యాంకు ఫుల్ చేయించుకుంటున్నారు. దీంతో పెట్రోల్ తో పాటు డీజిల్ కు సైతం కొరత ఏర్పడింది. రెండు మూడు రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే జరుగుతోంది. అయితే ఈ రోజు మాత్రం డీజిల్ కొరత తీవ్రమైంది. హెవీ హెవికల్స్ లారీ, బస్సు వంటివి సైతం పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరాయి. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీకి కూడా డీజిల్ కొరత ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆర్టీసీ ఈడీ రవివర్మ స్పందించారు. రాష్ట్రంలో మొత్తం 11 వేల బస్సులు నడుస్తున్నాయని, రోజుకు 7.5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బస్సులు నిరంతరం నడుస్తాయని రవి వర్మ స్పష్టం చేశారు.






