BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్.. దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు

by Naga Rani Yarlagadda |

సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ స్కామ్ లో దేశవ్యాప్తంగా భాగస్వాములైన వారి ఇళ్లపై దాడులు చేసింది.

BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్.. దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ స్కామ్ లో దేశవ్యాప్తంగా భాగస్వాములైన వారి ఇళ్లపై దాడులు చేసింది. మద్యం స్కామ్ లో నిందితులుగా ఉన్నవారి ఇళ్లు, ఆఫీసులు, ఇతర సంస్థలు.. మొత్తం దేశంలో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. తెలంగాణలోని హైదరాబాద్ లోనే 8 ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు కర్ణాటక, ఢిల్లీలోనూ ఈడీ అధికారులు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు 12 మందిని అరెస్ట్ చేయగా.. ముగ్గురు ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల టెంపరరీ బెయిల్ పై విడుదలై.. ఈనెల 11న మళ్లీ రాజమండ్రి సైంట్రల్ జైల్లో లొంగిపోయిన విషయం తెలిసిందే.

Next Story