ఈడీ దూకుడు.. ఏపీ మద్యం కేసులో కీలక విచారణ

by Vemula.Srinu Prasad |

ఏపీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కెసిరెడ్డి, చాణక్య, వాసుదేవరెడ్డికి రూ. 441. 61 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిందితులను విచారించింది..

ఈడీ దూకుడు.. ఏపీ మద్యం కేసులో కీలక విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కెసిరెడ్డి, చాణక్య, వాసుదేవరెడ్డికి రూ. 441. 61 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిందితులను విచారించింది. బ్యాంకు స్టేట్ మెంట్లు, పాన్ కార్డులు, కుటుంబ సభ్యల వివరాలతో రావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈడీ అధికారుల ఎదుట నిందితులు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో వేల కోట్లు కమిషన్లు, మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ధనుంజయరెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యను ప్రశ్నించారు. దాదాపు రెండు గంటలకు పైగానే విచారించారు. సీఐడీ సిట్ ఇచ్చిన నివేదిక మేరకు నిందితులను ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. అయితే పలు ప్రశ్నలకు మాట దాటవేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story