- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖలో ఎకో సిస్టం : సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మూడవ రోజు సింగపూర్లో పర్యటిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మూడవ రోజు సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ వ్యాపారవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటుకు (Data Center in AP) అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, ఇందుకోసం విశాఖలో ప్రత్యేకంగా ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని సీఎం తెలిపారు. త్వరలోనే అక్కడ గూగుల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు కానుందని, టీసీఎస్, కాగ్నిజెంట్ సహా పలు ఐటీ దిగ్గజ సంస్థలు తమ బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నాయని వివరించారు.
2026 జనవరికి అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభమై.. అక్కడి ఎకో సిస్టమ్ లో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. ఈ క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలను సింగపూర్ కంపెనీలు పొందడంతో పాటు పరిశోధనలు చేసేందుకు కూడా ఆస్కారం ఉందని సీఎం వివరించారు. మున్ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం విశాఖను గ్రోత్ ఇంజిన్ గా మార్చే లక్ష్యంతో ఐటీ, వాణిజ్యం, గృహ నిర్మాణ రంగాల్లో ప్రాజెక్టుల అభివృద్ధి ఉంటుందని తెలిపారు.






