Konaseema: ఆన్ లైన్ గేమ్స్‌ ఆడి ప్రాణం తీసుకున్న యువకుడు

by Disha Web Desk 16 |
Konaseema: ఆన్ లైన్ గేమ్స్‌ ఆడి ప్రాణం తీసుకున్న యువకుడు
X

దిశ,డైనమిక్ బ్యూరో : ఆన్ లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. ఆన్ లైన్ గేమ్స్‌లో అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేసేశాడు. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఆన్ లైన్ గేమ్‌లోనే మరిన్ని డబ్బులు సంపాదించాలనుకున్నారు. తాత ఆపరేషన్‌ కోసం అత్తయ్య పంపిన డబ్బులను సైతం ఆన్ లైన్ గేమ్‌లో పెట్టి సర్వం కోల్పోయాడు. అయితే ఈ డబ్బులు గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదఘటన ఏపీలోని డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది.

కొత్తపేట మండలం గంటి పంచాయతీ పల్లెపాలెం చెందిన చికురుమెల్లి సాధ్విక్ (19) ఆన్ లైన్ గేమ్స్‌కి అడిక్ట్ అయ్యాడు. విపరీతంగా గేమ్స్ ఆడుతూ ఉన్న డబ్బులున్నీ పోగొట్టుకున్నారు. అయితే తన తాత అనారోగ్యానికి గురవ్వడంతో ఆపరేషన్ అవసరం అయ్యింది. ఇందుకు సాధ్విక్ అత్త దుబాయ్ నుంచి రూ.78 వేలు పంపించారు. ఈ సొమ్ముతో సైతం ఆన్ లైన్ గేమ్ ఆడి పోగొట్టుకున్నారు. దీంతో ఏం చేయాలో తోచలేదు. ఇంట్లో తెలిస్తే మందలిస్తారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed