రెచ్చిపోతున్న గ్రావె‌ల్ మాఫియా.. పటించుకోని అధికారులు

by Vemula.Srinu Prasad |

మండలంలోని నల్లగొండ గ్రామంనుండి అనుమతులు లేకుండానే రాపాక.. రఘుదేవపురం గ్రామాల మీదుగా గ్రావె‌ల్ వ్యాపారం జరుగుతుంది...

రెచ్చిపోతున్న గ్రావె‌ల్ మాఫియా.. పటించుకోని అధికారులు
X

దిశ, సీతానగరం: మండలంలోని నల్లగొండ గ్రామంనుండి అనుమతులు లేకుండానే రాపాక.. రఘుదేవపురం గ్రామాల మీదుగా గ్రావె‌ల్ వ్యాపారం జరుగుతుంది. రోజున కనీసం 40 లారీలు గ్రామాలమీదుగా తిరగడంతో దుమ్ము, దూళి లేచి ఇళ్ళల్లోకి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. లారీల వల్ల దుమ్ము లేచిపోవడంతో వాహనాలకు దారి కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మండల స్దాయి నాయకులు సిండికేట్ ఏర్పడి ఈ అక్రమ గ్రావె‌ల్‌కు తెరలేపారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. నల్లగొండ మెట్ట నుంచి రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలతో తవ్వకాలు జరుపుతూ గ్రావె‌ల్ లారీలతో తరలిస్తున్నారు.సీతానగరం మండలంలో ఇది సర్వసాధారణం అయిపోయింది. అయితే అధికారులు పట్టించుకోపోవడంతో గ్రావె‌ల్ మాఫియా ఆడింది ఆట పాటింది పాట మారిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రావెల్ మాఫియా ఆగడాలు మైనింగ్, రెవెన్యూశాఖ అధికారులు పడించుకోకపోవడంతో యధేచ్చగా గ్రావె‌ల్ రవాణా జరుగుతుందని కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు. దీనితో ప్రభుత్వ ఆదాయానికి గంటి పడుతుంది. గ్రామాల్లో లారీలు వెళ్ళెసమయంలో వాటర్ ట్యాంక్ లతో రోడ్డు వాటర్ సర్వీస్ చేయాలని గ్రామస్తులు చెబుతున్న గ్రావె‌ల్ మాఫియా వినకపోవడంతో మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రావె‌ల్ మాఫీయాపై అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Next Story