- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి లోగా తీరాన్ని తాకనున్న మొంథా
నేడు సాయంత్రం నుంచి రాత్రి లోగా మొంథా తుఫాను (Cyclone Montha) తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

దిశ, వెబ్ డెస్క్ : నేడు సాయంత్రం నుంచి రాత్రి లోగా మొంథా తుఫాను (Cyclone Montha) తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం తుఫాను కాకినాడ తీరానికి సుమారు 190 కిలోమీటర్ల దూరం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం (Vishaka Meteorological Centre) అధికారి పేర్కొన్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటన్నర పాటు తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ బులిటెన్లు వెల్లడిస్తున్నామని తెలిపారు. మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందన్నారు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు అధికంగా కురుస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వరదలు వస్తాయని అంచనా వేశారు. మత్స్యకారులు మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. కాకినాడలో పదో నెంబరు, విశాఖ, గంగవరంలో తొమ్మిదో నెంబరు, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం తీరాల్లో ఎనిమిదో నెంబరు ప్రమాద హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశామన్నారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని కోరారు.
Read More... మచిలీపట్నం వైపు దూసుకు వస్తున్న తుఫాన్
Floods Alert: అతి భారీవర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్






