- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: రాజమండ్రిలో టీడీపీ- జనసేన సమావేశం ప్రారంభం.. హాజరైన పవన్, లోకేశ్
తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సమావేశం రాజమండ్రిలో ప్రారంభమైంది. ...

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సమావేశం రాజమండ్రిలో ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తులో పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరాహోటల్లోనే ఉమ్మడి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఉమ్మడి కార్యచరణపై చర్చిస్తున్నారు. వారాహి, భవిష్యత్‌కు గ్యారెంటీ, నిజం గెలవాలి యాత్రలపైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా టీడీపీ, జనసేన కేడర్ హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. సీట్లు, ఓట్లు ప్రస్తుతానికి పక్కనబెట్టి ఉమ్మడి పోరాటంపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రెండు పార్టీల్లో అంతర్గత సమావేశాలు
కాగా ఉమ్మడి కార్యచరణకు ముందే రెండు పార్టీల్లో అంతర్గత సమావేశాలు జరిగాయి. అంతేకాదు రెండు పార్టీల సొంత కార్యచరణ ఇప్పటికే అమలవుతున్నాయి. ఉమ్మడి కార్యచరణ కోసం రెండు పార్టీల నుంచి అటు కమిటీలను సైతం నియమించారు. ఈ ఉమ్మడి మీటింగ్‌కు ఇరు పార్టీల నుంచి 14 మంది హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత పవన్ కల్యాణ్, లోకేశ్ మీడియాతో మాట్లాడనున్నారు.






