- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో భారీ విస్పోటన.. 21కి చేరిన మృతులు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది....

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) సామర్లకోట మండలం వేట్లపాలెం(Vetlapalem)లోని బాణాసంచా(Fireworks) తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. మొత్తం 21మంది మృతి చెందారు. పేలుళ్ల సమయంలో మృతదేహాలు, శరీర భాగాలు ఘటనా స్థలం నుంచి పక్కనున్న పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. ప్రమాదంలో మరో 15 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో ఇంకా పలువురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందని తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీవో సంఘటనా స్థలానికి వెళ్లారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు. పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్ ఉందని, ప్రస్తుతం యజమాని పరారీలో ఉన్నారని ఆర్‌డీవో తెలిపారు. ఆస్పత్రులో చికిత్స పొందుతున్న 9 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆర్‌డీవో క్లారిటీ ఇచ్చారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మోర్తా శ్రీను, సత్యవేణి పరిస్థితి విషమంగా ఉందని, కాకినాడలో కె.శ్రీను, చిటికెల లక్ష్మి, డి.రాజు, లోవరాజు చికిత్స పొందుతున్నట్లు ఆర్డీవో తెలిపారు.






