- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేన మండలాధ్యక్షులకు ముహుర్తం ఫిక్స్
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ మండలాధ్యక్షుల ఎంపిక ప్రక్రియకు ముహుర్తం ఖరారైంది....

దిశ, పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ మండలాధ్యక్షుల ఎంపిక ప్రక్రియకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 25,26,27 తేదిల్లో జనసేన చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి వివరాలను వెల్లడించారు. ప్రజా స్వామ్య పద్ధతిలో ఎవరికి ఎక్కువ మంది మద్ధతిస్తే వారే మండల పార్టీ అధ్యక్షుల బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ఇప్పటికే గ్రామాల పార్టీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాధ్యక్షులతోపాటు, ప్రధానంగా పిఠాపురంపట్టణ, గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులను ఎన్నుకోవాల్సింది. దీంతో ఈనెల 25 నుండి వరుసగా మూడు రోజులపాటు ఎన్నిక ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని రామ్ తెలిపారు. జనసేన ముఖ్య నాయకులతోపాటు, ఫై మెన్ కమిటీ సహకారం కూడా ఉండాలన్నారు. ఏకగ్రీవం గాని పక్షంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మద్ధతు తెలిపితే వారికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఈ ప్రక్రియకు జనసైనికులంతా సహకరించాలని రామ్ కోరారు.
పోటీలో ఉన్నది వీరే..
పిఠాపురం మండలం జల్లూరుకు చెందిన వెన్నా జగదీష్, కందరాడ గ్రామానికి చెందిన పిల్లా శివశంకర్ పిఠాపురం మండల పార్టీ అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్నారు. వీరితోపాటు విరవాడ గ్రామానికి చెందిన యువకుడు బొజ్జా రామ్ ప్రసాద్ కూడా పోటీ పడతారని ప్రచారం జరుగుతోంది. పిఠాపురం పట్టణం నుండి ముఖ్యంగా చెల్లుబోయిన సతీష్‌కుమార్, కూరాకుల అరవింద్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొత్తపల్లి మండలం నుండి రావు అక్షయ్, వేగిశెట్టి నిఖిల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. గొల్లప్రోలు మండల అధ్యక్ష స్థానానికి దుర్గాడ గ్రామానికి చెందిన జ్యోతుల శ్రీనివాస్, వన్నెపూడి గ్రామానికి చెందిన మొయిళ్ళ నాగబాబు, చేబ్రోలు గ్రామానికి చెందిన ఓరుగంటి పెద్దకాపు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గొల్లప్రోలు టౌన్ అధ్యక్ష స్థానానికి మామిడిలా సూరిబాబు, మర్రి దొరబాబు, మలిరెడ్డి గంగబాబులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. పోటీ అనివార్యమైతే గ్రామ పార్టీ అధ్యక్షుల మద్ధతుపైనే ఫలితం ఆధారపడనుంది.






