- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Atrocious: భార్యపై అనుమానంతో కత్తెరతో పొడిచి చంపిన భర్త
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో దారుణం జరిగింది. ...

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను భర్త హత మార్చారు. అనంతరం నిందితుడు చిరంజీవి పారిపోయారు. పెరవలి మండలం అన్నవరప్పాడుకు చెందిన నవ్యకు, శెట్టిపేటకు చెందిన చిరంజీవికి పదకొండేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలున్నారు. చిరంజీవి తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే అనుమానం పెంచుకున్న భర్త ఇటీవల కాలంలో భార్యతో తరుచూ గొడవ పడుతున్నారు. ఇదే క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న నవ్యను చిరంజీవి మిషన్ కత్తెరతో పొడిచి చంపేశారు. నవ్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






