పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత.. రెచ్చిపోయిన రెండు వర్గాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-24 08:34:45  IST  )

పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత.. రెచ్చిపోయిన రెండు వర్గాలు
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పవన్ కల్యాణ్ ఎక్కడికైనా వెళితే జనాలు వాళ్లంతట వాళ్లు భారీగా తరలి రావడం, బహిరంగ ప్రదేశంలోనూ పరిస్థితి రద్దీగా మారడంలాంటివి జరగడం అందరికీ తెలిసిందే. ఇక భద్రత విషయంలో కొంచెం శ్రమించాల్సిందే. అలాంటిది ఎయిర్ పోర్టుల వద్ద అయితే భద్రత మరింత కట్టుదిట్టం చేయాల్సిందే. ఎవరు ఎటు నుంచి వస్తారో, ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఏర్పాట్లు గట్టిగానే చేయాల్సి ఉంటుంది. ఎయిర్ పోర్టు వద్ద అయినా, ఇతర ప్రాంతాల్లోనైనా పవన్ కల్యాణ్ ఉన్నాడంటే అక్కడకు వెళ్లేందుకు అనుమతులు తప్పని సరిగా ఉండాలి. అయితే కూటమి నాయకులు వెళ్లాలన్నా కూడా పవన్ భద్రత చూసే అధికారులకు సమాచారం ఇవ్వాలి. అనుమతులు తీసుకోవాలి.


కానీ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలో కూటమి నాయకుల వద్ద ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన నేపథ్యంలో మధురపూడి విమానాశ్రయం వద్దకు పవన్ కల్యాణ్ వెళ్లారు. దీంతో పవన్‌కు ఘన స్వాగతం పలికేందుకు కూటమి నాయకులు సైతం భారీగా తరలివెళ్లారు. అయితే వారిని ఎయిర్ పోర్టులోకి వెళ్లకుండా అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పెందుర్తి, బొడ్డు వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. టెర్నిలోకి తమను పంపించడం లేదని బొడ్డు వర్గం నేతలు ఆందోళనకు దిగారు. పెందుర్తి వర్గాన్ని ఎయిర్ పోర్టులోకి అనుమతించారని ఆరోపించారు. పెందుర్తి వర్గం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాలు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మేరకు వారిని పోలీసులు అడ్డుకున్నారు. సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.

Next Story