SubramanyaShashti | బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

by Thanuru Gopichand |

సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లాలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకొన్నాయి.

SubramanyaShashti | బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్ : సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లాలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకొన్నాయి. స్వామివారు కొలువుదీరిన దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని పురాతన దేవాలయాల్లో ఒకటైన బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలకు సంప్రదాయం ప్రకారం భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున తీర్థపు బిందె సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏడు రోజుల పాటు వేడుకలు జరగనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా తెల్లవారుజామునే భక్తులు దేవాలయానికి తరలివస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వరుసలో నిలుచుంటున్నారు. దర్శన అనంతరం కానుకలను, మొక్కులను చెల్లించుకుంటున్నారు. కొందరు భక్తులు తమ కుటుంబ సభ్యుల పేరిట అర్చన, అభిషేకాలను చేయించుకుంటున్నారు. పరమపావనమైన షష్టిని పురస్కరించుకొని ఒకరోజు ముందుగా చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో నిద్ర చేశారని అర్చకులు తెలిపారు.

దేవాలయ ప్రాశస్త్యం

బిక్కవోలు సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేక ఉందని భక్తులు చెబుతారు. వివాహమై సంతానం లేనివారు ఆలయంలో నిద్రిస్తే స్వామి కటాక్షిస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. అందుకే చాలా మంది భక్తులు ఇక్కడ నిద్రిస్తుంటారు. కొన్ని వందల సంవత్సరాల కిందట దేవతలు స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఏడాదికి ఒకసారి వచ్చే సుబ్రహ్మణ్య షష్టి రోజే కాకుండా సాధారణ రోజుల్లో సైతం భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి దర్శనం నిమిత్తం వస్తుంటారు.

Next Story