- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుక్కను బోల్తా కొట్టించి కారు, ల్యాప్‌టాప్ చోరీ... నిర్ఘాంతపోయిన యజమాని
కుక్కను బోల్తా కొట్టించి దొంగలు కారు, ల్యాప్ టాప్ కొట్టేశారు....

దిశ, వెబ్ డెస్క్: కుక్క(Dog)ను బోల్తా కొట్టించి దొంగలు(Thieves) కారు(Car), ల్యాప్ టాప్(Laptop) కొట్టేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా(Eastgodavari District)లో జరిగింది. కాజులూరు మండల గొల్లపాలెం(Gollapaleam)లో భగవాన్ అనే వ్యక్తి తన ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. దీంతో ఆయన వేరే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ విషయాన్ని గమనించి దొంగలు ఆ ఇంట్లో చోరీ చేయాలని ప్లాన్ వేశారు. అయితే ఇంట్లో కుక్క ఉంది. దీంతో మత్తుమందు కలిపిన బిస్కెట్లును కుక్క ఎదుట పడేశారు. అయితే బిస్కెట్లను తిన్న కుక్క కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంది. దీంతో దొంగలు చోరీకి రంగం ప్రవేశం చేశారు. ఇంట్లోకి చొరబడ్డారు.
అయితే అక్కడ ల్యాప్ టాప్ తప్ప ఏమీ లేవు. ఖాళీగా వెళ్లడం ఎందుకులే అనుకున్నారేమో గాని ల్యాప్ ట్యాప్ తీసుకుని బయటకు వచ్చారు. ఇంటి ఆవరణలో పార్క్ చేసిన కారును తీసుకొని వెళ్లిపోయారు. ఈ రోజు ఉదయం ఇంటి ముందు కారు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని భావించారు. కుక్కను చూసి నిర్ఘాంతపయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు, ల్యాప్ ట్యాప్ ట్రాక్ చేయడం ద్వారా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుక్కను పశువైద్యశాలకు తరలించారు. కాలనుగుణంగా నేరాల్లో కూడా దొంగలు కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.






