- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలు బస్సు ప్రమాదంలో రావులపాలెం వ్యక్తి మృతి
by Vemula.Srinu Prasad |
కర్నూలు బస్సు ప్రమాదంలో రావులపాలానికి చెందిన శ్రీనివాసరెడ్డి దుర్మరణం పాలయ్యారు..

X
దిశ, కొత్తపేట: కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలానికి చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (39) దుర్మరణం పాలయ్యారు. శ్రీనివాసరెడ్డి క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం పని నిమిత్తం హైదరాబాద్‌కి వెళ్లి, అక్కడినుంచి బస్సులో బెంగళూరుకు బయలుదేరగా దారిలో కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య జ్యోతి, ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడు వెంకటరెడ్డి, మూడో తరగతి చదువుతున్న దివ్య ఉన్నారు. ప్రమాదంలో శ్రీనివాస్ రెడ్డి చనిపోవడంతో భార్యా పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






