- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మహిళల భద్రత కోసం శక్తి యాప్’.. DSP కీలక వ్యాఖ్యలు
మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకున్న మహిళలు అత్యవసర సమయంలో సహాయం పొందవచ్చని డీఎస్పీ సుంకర మురళి మోహన్ అన్నారు.

దిశ, కొత్తపేట: మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకున్న మహిళలు అత్యవసర సమయంలో సహాయం పొందవచ్చని డీఎస్పీ సుంకర మురళి మోహన్ అన్నారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం శక్తి యాప్‌ను రూపొందించిందన్నారు. కొత్తపేట వి.కె.వి డిగ్రీ కళాశాలలో ఈ రోజు(సోమవారం) శక్తి యాప్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీమోహన్ మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో మహిళలకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి మహిళా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారి మొబైల్ కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ అవుతుందన్నారు. అత్యవసర సమయాల్లో, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు మొబైల్‌ను 5సార్లు షేక్ చేస్తే కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ వస్తుందని చెప్పారు. అలర్ట్ వచ్చిన ఐదు నిమిషాల్లో పోలీసులు అక్కడకు చేరుకుని బాధిత మహిళకు సహాయం చేస్తారని తెలిపారు. అలాగే యువత మత్తు పదార్థాలకు బానిసలు అవకుండా ఉండాలన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్ధాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐ విద్యాసాగర్, స్థానిక ఎస్సై సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.






