డిప్యూటీ సీఎంకు రూరల్ ఎమ్మెల్యే నానాజీ వినతి పత్రం

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మర్యాదపూర్వకంగా కలిశారు.

డిప్యూటీ సీఎంకు రూరల్ ఎమ్మెల్యే నానాజీ వినతి పత్రం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను తెలియజేస్తూ డిప్యూటీ సీఎంకు వినతి పత్రాన్ని సమర్పించారు. వినతి పత్రంలో పేర్కొన్న అంశాలను పరిశీలించి వాటిని పరిష్కరించాలని కోరారు. తద్వారా కాకినాడ రూరల్ నియోజకవర్గ (Kakinada Rural Constituency) ప్రజలకు లబ్ధి చేకూరేందుకు సహకరించాలన్నారు. ముఖ్యంగా కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఒకే లేఅవుట్ లో ఇండ్లను కేటాయించారన్నారు. అయితే ఇండ్ల యూనిట్ విలువలో మాత్రం వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. అర్బన్ లబ్ధిదారులకు రూ.2లక్షల 50వేలు ఇస్తుండగా, రూరల్ నియోజకవర్గ లబ్ధిదారులకు రూ.1లక్ష 59వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. అర్బన్ పరిధికి చెందిన లబ్ధిదారులతో సమానంగా యూనిట్ విలువ పెంచాలని, వ్యత్యాసాన్ని సవరించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎంను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ (MLA Pantham Nanaji) కోరారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు. తద్వారా సమస్య పరిష్కారానికి యత్నిస్తామని హామీనిచ్చారు. అదే విధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని పంచాయతీల్లో కొత్త రోడ్లు, డ్రెనైజీల నిర్మాణాలు, గుంతలుపడిన రోడ్లకు మరమ్మతులకు నిధులను మంజూరు చేయించడానికి సహకరిస్తామన్నారు.

Next Story