- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tuni: అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా
by Vemula.Srinu Prasad |
కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది....

X
దిశ, తుని: కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో బయటపడడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులు కళ్యాణి, సింహాచలం, సంబరి, అప్పన్న, రామలక్ష్మి విజయనగరం జిల్లా బొబ్బిలి వాసులుగా తెలిపారు.
బస్సు విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. బోల్తా పడిన ఆర్టీసీ బస్సుని క్రేన్ సహాయంతో తరలించి ట్రాఫిక్‌ని నియంత్రించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






