- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమండ్రిలో మద్యం సిండికేట్ల దుమారం.. స్పందించిన మజ్జి రాంబాబు
మద్యం సిండికేట్ల వ్యవహారంపై తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ దుమారం చెలరేగింది...

దిశ, వెబ్ డెస్క్: మద్యం సిండికేట్ల వ్యవహారం(Liquor Syndicates affair)పై తూర్పుగోదావరి జిల్లా(East Godavari District)లో రాజకీయ దుమారం చెలరేగింది. లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో టీడీపీ నేత మజ్జి రాంబాబు(TDP leader Majji Rambabu) రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారంటూ ఓ ఆడియో వినిపిస్తూ మాజీ ఎంపీ మార్గాని భరత్(Former MP Margani Bharat) సంచలన ఆరోపణలు చేశారు. జిల్లాలో టీడీపీ నేతలు మద్యం సిండికేట్లగా మారారని ఆరోపించారు. దీని వల్లే కల్తీ మద్యం ఏరులై పారుతోందని, అది తాగిన జనం చనిపోతున్నారంటూ భరత్ వ్యాఖ్యానించారు. దీంతో రాజమండ్రిలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. ఇందుకు కౌంటర్‌గా మార్గాని భరత్‌పై టీడీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తనపై మాజీ ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యలను మజ్జి రాంబాబు కొట్టిపారేశారు. తనకూ, ఆ వీడియోకు సంబంధం లేదని తెలిపారు. అది అంతా ఫేక్ వీడియో అని చెప్పారు. తనను అప్రదిష్ట పాలు చేయాలని, తన రాజకీయ కెరీర్‌ను పాడు చేయడానికి వైసీపీ నేతలు కుట్ర చేశారని ఆరోపించారు. మద్యం సిండికేట్లతో తాను మీటింగ్ పెట్టినట్లు రుజువు చేస్తే.. బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ వీడియో క్రియేట్ చేశారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తాను టీడీపీ రాజమండ్రి నగర అధ్యక్షుడిగా ఉండటం మార్గాని భరత్ జీర్ణించుకోలేకపోతున్నారని మజ్జి రాంబాబు విమర్శించారు.






