- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖతార్‌లో ఏపీ మహిళ మృతి
by Vemula.Srinu Prasad |
గల్ఫ్ వెళ్లిన కొమరగిరిపట్నం వాసి పద్మ అనారోగ్యంతో మృతి చెందారు...

X
దిశ, అల్లవరం: ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామం అంబేడ్కర్ నగర్‌కు చెందిన రొక్కాల పద్మ (49) అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఖతార్ దేశంలో గత కొన్నేళ్లుగా హౌస్ మెయిడ్‌గా పద్మ పనిచేస్తు్న్నారు. రెండు వారాల క్రితం నుంచి తీవ్ర అనారోగ్యానికి గురైన పద్మ అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండుగా ఈ నెల 19న మృతిచెందినట్లు సమాచారంఅందిందని చెప్పారు. మృతురాలి కుటుంబీకులు కూడా ఖతార్‌లో ఉంటుండగా వారి సహకారంతో ఆదివారం మృతదేహం స్వగ్రామమైన కొమరగిరిపట్నం చేరుతుందని తెలిసిందని వారు చెప్పారు. మృతురాలు పద్మకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Next Story






