Pawan Varahi Yatra: అది సాధారణ విషయం కాదు.. జనసేన పార్టీపై పవన్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-06-14 17:07:35  IST  )

పదేళ్లపాటు ఓ పార్టీని నడపడం మాటలు కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు....

Pawan Varahi Yatra: అది సాధారణ విషయం కాదు.. జనసేన పార్టీపై పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పదేళ్లపాటు ఓ పార్టీని నడపడం మాటలు కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో వారాహి యాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. రూ.10 వేల కోట్లు ఉన్నా పార్టీని పడమడం సాధ్యం కాదన్నారు. ప్రజల్లో గుండెల్లో ఉంటేనే పార్టీని నడపగలమన్నారు. భావజాలం అర్థం చేసుకునే వ్యక్తులుంటేనే పార్టీని నడపగలమని చెప్పారు. ఓ వ్యక్తి బలిదానం వల్ల ఆంధ్రరాష్ట్రం ఏర్పాడిందని పొట్టి శ్రీరాములును ఉద్దేశించి పవన్ మాట్లాడారు. పొట్టి శ్రీరాములు పేరుతో నేతలు సభలు పెట్టి వదిలేస్తున్నారని పవన్ గుర్తు చేశారు. జనసేన గుండెల్లో పొట్టి శ్రీరాములు స్పూర్తి ఉందన్నారు. ఆయన స్పూర్తితో యువతరం ముందుకెళ్లాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

AP Cm Jagan: ‘ఆదిపురుష్’ సినిమా టికెట్ ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్

Next Story