Kovvuru: బాధితులకు సీఎంఆర్​ఎఫ్​ సాయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-11-18 15:46:00  IST  )

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత అందజేశారు. ..

Kovvuru: బాధితులకు సీఎంఆర్​ఎఫ్​ సాయం
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత అందజేశారు. శనివారం కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఏడు కుటుంబాలకు రూ. 12.65 లక్షల విలువ గల చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలకు తానున్నానంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి అభయహస్తం అందిస్తోందన్నారు. బాధితులకు కొండంత అండగా జగనన్న ప్రభుత్వం నిలుస్తోందన్నారు. జిల్లాకు సంబంధించిన బాధిత కుటుంబాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే సీఎం జగన్​ వెంటనే స్పందించి సాయం అందజేసినట్లు తెలిపారు. జగనన్న ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని మరోసారి రుజువు చేశారని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

Next Story