- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి బీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా జడ్చర్ల పట్టణం అంతా గులాబీ మయం అయింది.

దిశ, జడ్చర్ల : మాజీ మంత్రి బీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా జడ్చర్ల పట్టణం అంతా గులాబీ మయం అయింది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు లక్ష్మారెడ్డి అభిమానులు వేలాదిగా తరలి రావడంతో పట్టణం అంతా సందడిగా మారింది. ఉదయం జడ్చర్ల కొత్త బస్టాండ్ ఫ్లై ఓవర్ నుంచి ప్రేమ్ రంగా గార్డెన్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. జై లక్ష్మారెడ్డి..జై లక్ష్మన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
1296 మంది రక్తదానం..
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బర్త్ డే సందర్భంగా నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు వేలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు జడ్చర్ల పట్టణంలోని ప్రతి వార్డు నుంచి పార్టీషన్లు తరలివచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్, షాద్నగర్ ప్రభుత్వ దవాఖాన తో పాటు మహబూబ్నగర్ బ్లడ్ బ్యాంకు వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 1296 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానంతో ఒకరికి ప్రాణదానం చేయడమే కాదు లక్ష్మారెడ్డి పై తమకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు.
క్రేజ్ తగ్గని లీడర్
అధికారంలో ఉన్న లేకున్నా ఆయనకు ప్రజల్లో మాత్రం ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనమే మంగళవారం జడ్చర్ల ప్రేమ్ రంక గార్డెన్స్ లో నిర్వహించిన ఆయన జన్మదిన వేడుకలు. లక్ష్మారెడ్డి బర్త్ డే సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం వార్డు పల్లె నుంచి వేలాదిగా ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఆయనతో ఫోటో దిగేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. వందలాదిగా రక్తదానం చేసేందుకు కూడా యువత స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఏ ఒక్కరిని కూడా నిరుత్సాహపరచకుండా ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ ఆప్యాయంగా వారిని పలకరిస్తూ లక్ష్మారెడ్డి పరి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. జడ్చర్ల పట్టణం నుంచి కాకుండా గ్రామాల నుంచి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున గజమాలలు పూలదండలు బొకేలు శాలువాలతో లక్ష్మారెడ్డి ని సన్మానించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జడ్చర్ల మున్సిపాలిటీ కౌన్సిలర్లు సర్పంచులు మాజీ ఎంపీపీలు జడ్పిటిసిలు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.






