- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాలతో నష్టపోయిన రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక ఆదేశాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 25 వరకు ఉన్న ధాన్యాన్ని కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లకు మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 25 వరకు ఉన్న ధాన్యాన్ని కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లకు మంత్రి కందుల దుర్గేశ్(Minsiter Kandula Durgesh) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు(Nidadavolu) నియోజకవర్గం పెరవలి మండలం కానూరు(Kanuru)సమీపంలో ఆకస్మిక వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోస్తున్న రైతులను చూసి కాన్వాయ్‌ను ఆపి వారితో మాట్లాడారు. రైతుల కష్టాలు, వారి ఆందోళనలు తెలుసుకుని, ధాన్యం పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అయితే ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాల కారణంగా నష్టపోయామని, తేమ శాతం పెరగడం వల్ల ధాన్యం కొనుగోలుపై సందేహాలు ఉన్నాయని మంత్రి దుర్గేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంలో వారికి ధైర్యం చెబుతూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి స్పష్టం చేశాను.






