విద్రోహి సినిమా అంద‌రనీ అల‌రిస్తుంది: ద‌ర్శ‌కుడు వీఎస్వీ

by Vemula.Srinu Prasad |

‘విద్రోహి’ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత వెంక‌ట సుబ్ర‌హ్మ‌ణ్యం విజ్జన అన్నారు. ....

విద్రోహి సినిమా అంద‌రనీ అల‌రిస్తుంది: ద‌ర్శ‌కుడు వీఎస్వీ
X

దిశ‌, అమ‌లాపురం: రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విద్రోహి’ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత వెంక‌ట సుబ్ర‌హ్మ‌ణ్యం విజ్జన అన్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో శుక్ర‌వారం విడుద‌ల అవుతుంద‌ని తెలిపారు. అల్ల‌వ‌రం మండ‌లం కొమ‌ర‌గిరిప‌ట్నం గ్రామానికి చెందిన ద‌ర్శ‌క నిర్మాత వీఎస్వీ మీడియా కు చిత్ర విశేషాల‌ను వివ‌రించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ఇటీవ‌లే హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , సెకండ్‌ సాంగ్ ఆర్ పి పట్నాయక్ విడుదల చేశార‌ని, ఆడియో ప్రేక్ష‌కాద‌ర‌న పొందుతున్నాయ‌న్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈ నెల 24 న విడుదలకానున్న ఈసినిమా ట్రైలర్‌ను కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఆవిష్కరించారని తెలిపారు.

విద్రోహి సినిమాలో రవిప్రకాష్, శివ కుమార్ అద్భుతంగా నటించారని, ఇందులోని ప్రతి క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు రాని సరికొత్త పాయింట్‌తో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించామని వెల్ల‌డించారు. సినిమాలో తాగుబోతు రమేష్, మధునందన్, కోటేశ్వరరావు, జబర్దస్త్ బాబీ, రణ్వీర్ సాయి, ఆర్ కర్ణ, నవికేత్ పాటిల్, రాఘవేంద్ర పప్పుల, అన్వేష్ త‌దిత‌ర తారాగ‌ణం న‌టించింద‌ని, ఈసినిమాకు సంగీతం భీమ్స్ సిసిరోలియో అద్భుత బాణిల‌ను అందించార‌ని, ఎడిటింగ్ ఉపేంద్ర, ఎంఎన్ఆర్, డీవోపీ సతీష్ ముత్యాల, లిరిక్స్ సురేష్ గంగుల, దేవ్ పవార్, ఉమా వంగూరి, క‌థ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ త‌న సార‌ధ్యంలో సాగింద‌న్నారు.

Next Story