- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తగ్గేదే లే.. కొబ్బరికి ఆల్ టైం రికార్డు ధర
by Naga Rani Yarlagadda |
కొబ్బరికాయలు ధర ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. వెయ్యి కాయలు పెద్ద సైజు రూ. 28,000, చిన్న సైజు రూ.20,000 ధర పలుకుతున్నాయి.

X
దిశ, పాలకొల్లు: కొబ్బరికాయలు ధర ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. వెయ్యి కాయలు పెద్ద సైజు రూ. 28,000, చిన్న సైజు రూ.20,000 ధర పలుకుతున్నాయి. చెట్టు పైనుంచి దింపు తీసిన కార్మికునికి ఒక్కో కాయికి రూ. రెండు రూపాయలు తీసుకుంటున్నారు. ఒకవైపు తమిళనాడులో దిగుబడి తగ్గిపోవడం, మరోవైపు ఏపీలో కూడా అంతంత మాత్రమే కావడంతో పాటు దసరా పండుగ, సీజన్ కావడంతో ధర పెరుగుదలకు కారణమని వ్యాపారి కాపీశెట్టి నాగరాజు తెలిపారు. అయితే రాబోయే కాలంలో తగ్గే అవకాశం కూడా లేకపోలేదని ఆయన చెప్పారు. కాగా అత్యధిక ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతులు జోరుగా సాగుతున్నాయి.
Next Story






