- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ లాంటి సీన్..
పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న భారీ ముఠా గుట్టును సివిల్ సప్లై అధికారులు రట్టు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న భారీ ముఠా గుట్టును సివిల్ సప్లై అధికారులు రట్టు చేశారు. కాకినాడ పోర్టులో శనివారం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఐదు లారీలలో అక్రమంగా తరలిస్తున్న 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ (PDS) బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ బియ్యం విలువ సుమారు రూ. 65 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యంలో ప్రభుత్వం పంపిణీ చేసే పోర్టిఫైడ్ కెర్నల్స్ (పోషక విలువలు కలిగిన బియ్యం గింజలు) కలిసినట్లు సివిల్ సప్లై అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ రేషన్ బియ్యమేనని వారు నిర్ధారించారు. ఈ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసేందుకు నిందితులు ప్రణాళిక రచించినట్లు సమాచారం.
ఐదు లారీలు సీజ్..
బియ్యంతో పాటు ఐదు లారీలను సీజ్ చేసిన అధికారులు, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిందితులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ బియ్యాన్ని రీ-సైక్లింగ్ చేస్తూ కాకినాడ పోర్టును అక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకున్న వారిపై నిఘా మరింత తీవ్రం చేస్తామని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. సరిగ్గా ఇలాగే బియ్యం అక్రమ రవాణాను గేమ్ ఛేంజర్ సినిమాలో హీరో రామ్ చరణ్ అడ్డుకొని చూపించే సన్నివేశాలు ఉండటం గమనార్హం.






