- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajahmundry : బలహీనంగా చంద్రబాబు.. కుటుంబ సభ్యుల భావోద్వేగం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుకు రాజమండ్రి జైలులో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఆవేదన చెందారు. చంద్రబాబు చాలా బలహీనంగా కనిపిచండంతో భావోద్వేగానికి గురయ్యారు. అక్టోబర్ 6న ములాఖత్ అయినప్పుడు చంద్రబాబు ఆరోగ్యంగా కనిపించారు. కానీ ఇప్పుడు అలా కనిపించకపోవడంతో బాధపడుతున్నారు. ములాఖత్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండా నారా లోకేశ్ వెళ్లిపోయారు. మానసికంగా చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఉన్నా ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించి మెరుగైన చికిత్స అందించాలని కోరనున్నారు.






