- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆక్రమణలన్నీ తొలగిస్తాం: ఎమ్మెల్యే వార్నింగ్
రాజమండ్రి నియోజకవర్గం కడియం మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే రోడ్ల విస్తరణకు ఆక్రమణలన్ని అడ్డువస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిర్ణయం తీసుకున్నారు....

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి నియోజకవర్గం కడియం మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే రోడ్ల విస్తరణకు ఆక్రమణలన్ని అడ్డువస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిర్ణయం తీసుకున్నారు. రోడ్ల విస్తరణకు అడ్డొచ్చని ఆక్రమలన్నీ తొలగిస్తామని చెప్పారు. ఎవరికీ మినహాయింపు ఉండదని హెచ్చరించారు.
పూర్తిస్థాయిలో తొలగించాలని ఆదేశం
ఈ మేరకు కడియం- వీరవరం రోడ్డు విస్తరణలో ఆక్రమణల తొలగింపుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆదివారం ఆయన ఆ ప్రదేశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. దోసాలమ్మ కాలనీ జంక్షన్‌లో విపరీతంగా ఉన్న ఆక్రమణలన్నీ పూర్తిస్థాయిలో తొలగించాలని తాసిల్దార్ సునీల్ కుమార్‌కు ఆదేశించారు. దోసాలమమ్మ కాలనీ వైపు అలాగే వీరవరం రోడ్డులో ఉన్న ఆక్రమణలను ఆయన పరిశీలించారు. రోడ్డు విస్తరించినప్పటికీ ఈ ఆక్రమణల వల్ల వాహనాలు కనిపించే పరిస్థితులు లేవని ఏ ఒక్క ఆక్రమణ ఉండడానికి వీలు లేదన్నారు. అందుకు ఎవరి రికమండేషన్లు పట్టించుకోవద్దని సూచించారు. రోడ్ల విస్తరణకు కావాల్సినన్ని నిధులు ఈ రెండేళ్ల కాలంలో సమకూర్చానని ఇలాంటి ఆక్రమణల వల్ల ఈ రోడ్లు వేసినా ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. దోసాలమ్మ కాలనీ నాలుగు రోడ్ల జంక్షన్ సంపూర్ణ మార్పులు జరగనున్నాయన్నారు. ఈ కాలనీని అనుకుని దాత ఇచ్చిన స్థలం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని తెలిపారు. మండలంలో విద్యుత్ సమస్యలు పూర్తిస్థాయిలో లేకుండా చేయడానికి వీరవరంలో సబ్ స్టేషన్ నిర్మించాలని మూడు నెలల నుంచి ప్రయత్నిస్తున్న స్థలం దొరకని పరిస్థితి ఉందన్నారు. అందుకునే ఈ ఆక్రమణలు తొలగించి ఆ ప్రదేశంలో విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మించి మండల వ్యాప్తంగా ప్రజలకు, రైతులకు మెరుగైన విద్యుత్తును అందిస్తామన్నారు. ఆక్రమణలకు తాను మొదటి నుంచి వ్యతిరేకినన్నారు. గతంలో ధవళేశ్వరం రోడ్డు ఆక్రమణలు తొలగించి విస్తరించిన తీరును వివరించారు.
అవకాశం ఇస్తే..
కొంతమంది కోసం ఆలోచించి ఈ ఆక్రమణలకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బుచ్చయ్య చౌదరి తెలిపారు. అందువల్ల ఈ ఆక్రమణ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులు మళ్లీ పూర్తిస్థాయి సర్వే చేసి ఈ ఆక్రమణల తొలగింపుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే బుర్రిలంక ఆంజనేయ స్వామి విగ్రహం జాతీయ రహదారి నుంచి చిరంజీవి ఆఫీస్ మీదుగా బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు నిర్మించమన్నారు. అయితే ఆ రోడ్డు కొనసాగింపుగా కడియం వరకూ రోడ్డు నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు, రైతులు కోరడంతో అక్కడికెళ్లిపరిశీలించారు. త్వరలోనే ఈ రోడ్డు మంజూరు చేయించి పక్కా రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు.






