- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాగు నీరు ఇవ్వండి: ఒంటితాడు గ్రామస్తుల మొర
by Vemula.Srinu Prasad |
తాగునీటి సమస్య పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వర్ రావు డిమాండ్ చేశారు..

X
దిశ, కాజులూరు: తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వర్ రావు డిమాండ్ చేశారు. మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో ఒంటితాడు గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రెండు నెలల నుంచి గ్రామానికి నీరు రావడంలేదని ఆరోపించారు. అధికారులు , పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. గతంలో రెండు రోజులకోసారి నీరు విడుదల చేశేవారని తెలిపారు. గొల్లపాలెం రక్షిత మంచినీటి ట్యాంకు నుంచి పైపు లైను నీరు రావాల్సి ఉందని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నీటి సరఫరా జరగడంలేదని వ్యాఖ్యానించారు.. అధికారులు వెంటనే స్పందించాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story






