వేట్లపాలెం బ్లాస్ట్.. 26కు చేరుకున్న మృతులు

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణా సంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లలో మరో మరణం నమోదు అయింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందారు...

వేట్లపాలెం బ్లాస్ట్.. 26కు చేరుకున్న మృతులు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada) వేట్లపాలెం(Vetlapaleam) బాణా సంచా(Fireworks) తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లలో మరో మరణం నమోదు అయింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరుకుంది. ఘటన జరిగిన రోజు స్పాట్‌లో 21 మంది చనిపోగా క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం అందించినప్పటికీ పలువురి పరిస్థితి విషమించి మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు.

ఈ రోజు మరో వ్యక్తి మృతి

తాజాగా ఈ రోజు మరో వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు క్షతగాత్రులు సైతం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యుర్‌తో క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు కార్మికులు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోవైపు ప్రమాదం పై విచారణకు ఉన్నత స్ధాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Next Story