- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్రైడ్ రైస్ పార్టీ అని చెప్పి..బావిలో తోసేశాడు.. చివరికి..?
కాకినాడ జిల్లాలో ఈనెల 16న గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జంట హత్యల కేసులో నిందితుడ్ని పిఠాపురం సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు..

దిశ, పిఠాపురం: కాకినాడ జిల్లాలో ఈనెల 16న గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జంట హత్యల కేసులో నిందితుడ్ని పిఠాపురం సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తాటిపర్తి గ్రామానికి చెందిన రంపం గంగాధర్ అదే గ్రామానికి చెందిన రంపం శ్రీనివాస్, తోరాటి సూరిబాబును పథకం ప్రకారం హత్య చేసినట్లు విచారణలో తేలిందని సిఐ వెల్లడించారు. ఫ్రైడ్ రైస్ పార్టీ ఇస్తానని చెప్పి బావి వద్దకు తీసుకెళ్లి బావి గట్టుపై ఫ్రైడ్ రైస్ తింటుండగా అదును చూసి ఇద్దరిని బావిలో తోసేసి హతమార్చినట్టు విచారణలో వెల్లడైందన్నారు. ఇదే తరహాలో కుంపట్ల సూరిబాబు అనే వ్యక్తిని రంపం గంగాధర్ హతమార్చేందుకు అదే రోజు రాత్రి ప్రయత్నించాడు. తన సెల్ ఫోన్ అక్కడ దగ్గర్లో కొండకాలువలో పడిపోయిందని వెతుకుదామని చెప్పి , కొండ కాలువలో ముంచి చంపడానికి ప్రయత్నించాడని విచారణలో తేలిందన్నారు.
ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను చంపడానికి ప్లాన్ ప్రకారం గంగాధర్ ప్రయత్నించారని, ఇద్దరిని బావిలోకి తోసి చంపేసి, మూడో వ్యక్తిని చంపడానికి ప్రయత్నించడంతో అతడిపై హత్య, హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ హత్యల వెనుక పూర్తిగా ఆర్థిక లావాదేవిల వ్యవహారమే కారణంగా తేలిందన్నారు. నిందితుడిని పిఠాపురం రైల్వేస్టేషన్ వద్ద అరెస్టు చేసినట్లు సిఐ వెల్లడించారు. ఈ కేసులో నిందితుడ్ని గుర్తించి, త్వరితగతిన అరెస్టు చేయడంతో సహకరించిన సర్కిల్ పరిధిలోని ఎస్సైలను, క్రైమ్ బృందాన్ని సిఐ అభినందించారు.






