- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి బ్యాచ్ హల్ చల్.. మహిళల పట్ల అనుచిత ప్రవర్తన
కోనసీమ జిల్లాలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది...

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యన గంజాయి బ్యాచ్ మితిమీరిన ఆగడాలకు పాల్పడుతోంది. విచ్చలవిడిగా గంజాయి సేవిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. కొందరైతే ఆయుధాలతో దౌర్జన్యం చేస్తున్నారు. రోడ్డుపై కొందరిని అడ్డగించి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు అల్లరికమూకలపై మాత్రం సాదాసీదాగా వ్యవహరిస్తున్నారు. గంజాయి సేవించి వీధుల్లో రచ్చ చేస్తున్న యువకుల పట్ల ఉదాసీనతను చూపుతున్నారు. దీంతో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేయడం విచ్చలవిడిగా మారింది.
తాజాగా కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడిలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. గంజాయి, మద్యం సేవించి ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఈ వీడియోలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు వైరల్ కావడంతో పోలీసులు యువకులపై కేసు నమోదు చేశారు. యువకుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు గంజాయి బ్యాచ్‌ల తీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా గంజాయి బ్యాచ్‌పై నిఘా పెట్టాలని, కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.






