వేట్లపాలెం బాణాసంచా పేలుళ్లపై సీఎం చంద్రబాబు విచారం

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారు కేంద్రంలో పేలుళ్లు సంభవించి 18 మంది మృతి చెందారు...

వేట్లపాలెం బాణాసంచా పేలుళ్లపై సీఎం చంద్రబాబు విచారం
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) సామర్లకోట మండలం వేట్లపాలెం(Vetlapalem)లో బాణాసంచా తయారు కేంద్రం(Fireworks manufacturing center)లో పేలుళ్లు సంభవించి 18 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి కారణాలు... ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. పెద్ద సంఖ్యలో బాణాసంచా తయారీదారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లి, సహాయ చర్యల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు.

Next Story