- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లిపై ప్రత్యర్థుల చూపు.. పోలీస్ శాఖ కీలక నిర్ణయం
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు భద్రతను పెంచారు..

దిశ,వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు భద్రతను పెంచారు. ఆయనపై ప్రత్యర్థులు దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నల్లిమిల్లి వ్యక్తిగత భద్రతను 2+2కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గత ఎన్నికలకు ముందు టీడీపీలో పని చేశారు. ఆ పార్టీలో సీటు రాకపోవడంతో బీజేపీలో చేరారు. కూటమి తరపున అనపర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ప్రజల్లోకి సేవకే అంకితమయ్యారు. ప్రజల్లో మమేకం అవుతూ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యర్థులు దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం వెళ్లింది. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వద్ద ఉన్న 1+1 భద్రతను 2+2గా పెంచాలని పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నల్లమిల్లికి సెక్యూరిటీని పెంచారు.






