- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు అలర్ట్.. షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అలర్ట్ ఇచ్చింది. సోమవారం మధ్యాహ్నం.. ఈఏపీ సెట్ (EAPCET ) షెడ్యూల్ (Schedule)ను ప్రభుత్వం విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులకు ప్రభుత్వం అలర్ట్ ఇచ్చింది. సోమవారం మధ్యాహ్నం.. ఈఏపీ సెట్ (EAPCET ) షెడ్యూల్ (Schedule)ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈఏసి సెట్ ద్వారా రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కి చెందిన కలశాలల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందుకు గాను నేడు ఈఏపీ సెట్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 22 నుంచి న్ లైన్ లో దరకాస్తుల స్వీకరణ కు అవకాశం కల్పించారు. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పరీక్షలు ముగిసిన అనంతరం ఫలితాల తేదీలను ప్రకటించి.. నిర్ణీత తేదీల్లోనే ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ సెట్ ద్వారానే రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో అడ్మీషన్స్ నిర్వహిస్తారు.
కాగా ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఫీజు రియింబర్స్మెంట్ ద్వారా తమ విద్యను కొనసాగిస్తున్నారు. కాగా పరీక్షల్లో సాధించిన ర్యాంకులను బట్టి విద్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత అన్ని రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. EAPCET కోసం సిద్ధం కావడానికి, అభ్యర్థులు EAMCET సిలబస్ 2025, EAMCET 2025 పరీక్షా సరళికి కట్టుబడి ఉండాలి. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (ఇంజనీరింగ్ కోసం) లేదా బయాలజీ (వ్యవసాయం- వైద్యం కోసం) విద్యార్థుల పరిజ్ఞానాన్ని అంచనా వేస్తుంది. AP EAMCET ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ప్రవేశానికి గేట్‌వేగా పనిచేస్తుంది. కోరుకున్న కోర్సు, కళాశాలలో సీటు పొందేందుకు మంచి స్కోర్ అవసరం. ఇంకా, EAMCET 2025లో అధిక ర్యాంక్‌లను సాధించడం, పాల్గొనే ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ పొందే అవకాశాన్ని గణనీయంగా పెంచుతుంది.






