దుర్గమ్మ చల్లని చూపు రాష్ట్రంపై ఉండాలి.. ప్రజలకు దసరా విషెస్ చెప్పిన CM చంద్రబాబు

by Kema Shiva Kumar |

రెండు తెలుగు రాష్ట్రాలు విజయదశమి వేడుకులకు సిద్ధమయ్యాయి.

దుర్గమ్మ చల్లని చూపు రాష్ట్రంపై ఉండాలి.. ప్రజలకు దసరా విషెస్ చెప్పిన CM చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలు విజయదశమి వేడుకులకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రజలకు సోషల్ మీడియా వేదికగా దసరా విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ‘X’ (ట్విట్టర్) వేదికగా రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించిన విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. సకల చరాచర జీవరాసులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నామని అన్నారు.

రాక్షస సంహారంతో లోకానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చిన ఆ తల్లి చల్లని చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధితో ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలాన్ని అందివ్వాలన్నారు. అనునిత్యం పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు, పేదల సేవలో పెన్షన్లు, మహిళలు, తల్లులకు ఆసరాగా నిలిచే ‘దీపం’, ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీశక్తి’, బిడ్డలను విద్యావంతుల్ని చేసే ‘తల్లికి వందనం’ రైతుకు అండగా నిలిచే ‘అన్నదాత సుఖీభవ’, పేదల చేయిపట్టి అభివృద్ధి వైపు నడిపే ‘పీ4’ విధానం, పారిశ్రామిక ప్రగతితో ఈ దసరా పండుగ ఇంటింటా వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నా.. మరొక్క మారు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

Next Story