Ap Govt: డీఎస్సీ ఉద్యోగులకు నియామక పత్రాల అందజేత

by Vemula.Srinu Prasad |

అమరావతిలో డీఎస్సీ(DSC) నియామక పత్రాల అందజేత కార్యక్రమం జరిగింది....

Ap Govt: డీఎస్సీ ఉద్యోగులకు నియామక పత్రాల అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో డీఎస్సీ(DSC) నియామక పత్రాల అందజేత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, కుటుంబసభ్యులతో సహా డీఎస్సీలో ఉద్యోగం పొందిన అభ్యర్థులు సైతం పాల్గొన్నారు. టాప్ 20లో వచ్చిన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. మిగిలిన వారికి అధికారులు జిల్లాల వారీగా నియామక పత్రాలు అందజేయనున్నారు.

కాగా అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నిరుద్యోగ యువతకు కూటమి తరపున హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించారు. తద్వారా 16000 మంది అర్హత సాధించారు. దీంతో వారందరికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి రుణ పడి ఉంటామని చెప్పారు.

Next Story