Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. TDP అధిష్ఠానానికి ఎంపీ పుట్టా మహేశ్ వివరణ

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-21 03:18:36  IST  )

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ అధిష్ఠానం ఇచ్చిన షోకాజు నోటీసులకు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ బదులిచ్చారు.

Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. TDP అధిష్ఠానానికి ఎంపీ పుట్టా మహేశ్ వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ (MP Putta Mahesh Kumar) తనపై వస్తున్న వార్తలపై తెలుగుదేశం పార్టీ (TDP) అధిష్ఠానానికి వివరణ ఇచ్చారు. ఆయకు అందిన షోకాజ్ నోటీసులకు తాజాగా రిప్లై ఇచ్చారు. తాను కేవలం డిన్నర్‌కు ఆహ్వానిస్తేనే అక్కడికి వెళ్లానని, అక్కడ ఎలాంటి డ్రగ్స్ తాను తీసుకోలేదని స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఆరోపణలు రావడంతో టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. 5 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు. అయితే, ఎంపీ ఇచ్చిన రిప్లైతో విషయం ఇంతటితో సద్దుమణుగుతుందా, లేక కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు ఇదే కేసులో తెలంగాణ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ కూడా పైలట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే ఆ నోటీసుపై ఆయన ఇంకా స్పందించాల్సి ఉంది. రాజకీయ ప్రముఖుల పేర్లు ఈ డ్రగ్స్ కేసులో బయటకు రావడంతో ఇరు రాష్ట్రాల్లోనూ విషయం చర్చనీయాంశంగా మారింది.

Next Story