రాష్ట్రంలో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టివేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-22 13:25:24  IST  )

విశాఖ జిల్లా పెందుర్తి పీఎస్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేగింది.....

రాష్ట్రంలో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం డ్రగ్స్(Drugs), గంజాయి(Ganja)పై ఉక్కుపాదం మోసినా దుండగులు ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. యదేచ్ఛగా రవాణా చేస్తున్నారు. రాష్ట్రంలో గురువారం రెండు ఘటనలు చోటు చేసుకుంది. విశాఖ జిల్లా(Visakha District)లో డ్రగ్స్ పట్టుబడితే మరో జిల్లాల్లో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి పీఎస్(Pendurthi Ps) పరిధిలో డ్రగ్స్ కలకలం రేగింది. స్థానిక సుజాత నగర్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ నివాసంలో ఉంటున్న వ్యక్తి నుంచి 3.5 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను విచారించగా మరో ముగ్గురు నిందితుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో చోట జరిపిన తనిఖీల్లో..

మరో చోట జరిపిన వాహన తనిఖీల్లో 500 కేజీల గంజాయి పట్టుబడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కారులో తరలిస్తుండగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story