- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రోన్ ఆపరేషన్ సక్సెస్.. రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
ఏపీలో డ్రోన్ ఆపరేషన్ సక్సెస్ అయింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో డ్రోన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. దీంతో రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. కొంతకాలంగా రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి, పేకాట, బహిరంగ మద్యంపై డ్రోన్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఈ మేరకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. చర్యలు చేపడుతున్నారు. ఇక గంజాయిపై అయితే మరింత ఫోకస్ పెంచారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి తరలింపుకు కళ్లెం వేస్తున్నారు. పక్కా సమాచారంతో గంజాయి తరలింపును అడ్డుకుని వాహనాలను సీజ్ చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట శివారులో పోలీసులు డ్రోన్ ఆపరేషన్ నిర్వహించారు. దీంతో గంజాయిని తరలిస్తున్న వ్యాన్‌ను గుర్తించారు. ఈ మేరకు వ్యాన్‌ను డ్రోన్ ఫాలో అయింది. ఈ విషయాన్ని గుర్తించిన దుండగులు.. వ్యాన్‌ను వదిలి పరారయ్యారు. వ్యాన్‌లో చెక్ చేయడంతో రూ. 2 కోట్ల విలువైన గంజాయి గుట్టు రట్టు అయింది.
అయితే ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబర్ల వాహనాలతో స్మగ్లర్లు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యాన్‌తో సహా గంజాయిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, మత్తుపదార్థాలు తరలిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు పేర్కొన్నారు.






