కర్నూల్ బస్సు ప్రమాదంపై సంచలన విషయాలు వెల్లడించిన డ్రైవర్ లక్ష్మయ్య

by Malleboina Mahesh |

కర్నూల్ జిల్లా చిన్న టేకూరు గ్రామం సమీపంలో హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

కర్నూల్ బస్సు ప్రమాదంపై సంచలన విషయాలు వెల్లడించిన డ్రైవర్ లక్ష్మయ్య
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లా చిన్న టేకూరు గ్రామం సమీపంలో హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారి (Hyderabad-Bangalore National Highway)పై జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కావేరి ట్రావెల్స్‌ ప్రైవేట్‌ బస్సు (Kaveri Travels Private Bus) ఒక మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ఆ బైక్‌ బస్సు క్రింద చిక్కి మంటలు చెలరేగాయి. కొద్ది సెకండ్లలోనే బస్సు మొత్తాన్ని అగ్ని చుట్టేసింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పలు కీలక విషయాలను గుర్తించారు.

ఈ క్రమంలో ప్రమాద సమయంలో బస్సును నడిపిన డ్రైవర్ లక్ష్మయ్య (driver Lakshmaiah)ను విచారించగా.. పలు కీలక విషయాలను తెలిపాడు. వర్షం కారణంగా రోడ్డు పై నల్లని రంగులో బైక్ ఉండటం దూరం నుంచి గమనించలేక పోయానని, దగ్గరకు వచ్చాక సడెన్ గా బైక్ కనిపించిందని, బ్రేకులు వేస్తూ.. వెనకాలే వచ్చే వాహనాలు బస్సును ఢీకొట్టి భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తప్పని పరిస్థితుల్లో బైక్ పై నుంచి బస్సులు తీసుకెళ్లడం జరిగిందని పోలీసులకు డ్రైవర్ లక్ష్మయ్య చెప్పుకొచ్చాడు. అయితే పోలీసుల దర్యాప్తులతో రోడ్డుపై పడి ఉన్న బైకును అంతకుముందే గమనించిన రెండు మూడు బస్సులు తప్పించుకొని పోయాయని, కావేరి ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు.

Next Story