విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం..సిటీ సెంటర్‌లో ఇద్దరు యువకుల హత్య

by Ajay Maddhiboyina |

విజ‌య‌వాడ‌లో డ‌బుల్ మ‌ర్డ‌ర్ క‌ల‌క‌లం రేపింది. సిటీ సెంట‌ర్లో ఇద్ద‌రు యువ‌కులు దారుణ హత్య‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న గ‌వ‌ర్న‌ర్ పేట‌లోని అన్నపూర్ణ

విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం..సిటీ సెంటర్‌లో ఇద్దరు యువకుల హత్య
X

దిశ‌, వెబ్ డెస్క్: విజ‌య‌వాడ‌లో డ‌బుల్ మ‌ర్డ‌ర్ క‌ల‌క‌లం రేపింది. సిటీ సెంట‌ర్లో ఇద్ద‌రు యువ‌కులు దారుణ హత్య‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న గ‌వ‌ర్న‌ర్ పేట‌లోని అన్నపూర్ణ థియేట‌ర్ సమీపంలో చోటు చేసుకుంది. ఒక గ‌దిలో ఇద్ద‌రు యువ‌కులు ర‌క్త‌పుమ‌డుగులో క‌నిపించ‌గా స్థానికులు కంగారు ప‌డ్డారు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మొద‌ట గ‌దిలో ఇద్ద‌రు యువ‌కులు ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకుని చ‌నిపోయార‌ని భావించారు.

కానీ త‌ర‌వాత ఇద్ద‌రినీ టూటౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని రౌడీ షీట‌ర్ కిషోర్ హ‌త్య చేసిన‌ట్టు గుర్తించారు. ఇద్ద‌రిని హ‌త్య చేసి కిషోర్ అక్క‌డ నుండి పారిపోయిన‌ట్టు నిర్దారించారు. ఇక హత్య‌కు గురైన ఇద్ద‌రు యువ‌కులు క్యాట‌రింగ్ బాయ్స్ అని తెలుస్తోంది. వారిద్ద‌రూ విజ‌య‌న‌గ‌రం, విజ‌య‌వాడ వాసులు కాగా గ‌వ‌ర్న‌ర్ పేటలో అద్దె ఇంట్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. యువ‌కులకు రౌడీ షీట‌ర్ తో వాగ్వాదం జ‌ర‌గ‌టంతో హ‌త్య చేసి పారిపోయిన‌ట్టు గుర్తించారు. నింధితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story