- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తులకు టీటీడీ అలర్ట్... వాటిని నమ్మకండి
ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు ఉండటంతో భక్తిని క్యాష్ చేసుకునేందుకు కొందరు మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తిరుమల ప్రసాదం పేరుతో వ్యాపారం చేస్తున్న కొన్ని వెబ్ సైట్లను టీటీడీ

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు ఉండటంతో భక్తిని క్యాష్ చేసుకునేందుకు కొందరు మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తిరుమల ప్రసాదం పేరుతో వ్యాపారం చేస్తున్న కొన్ని వెబ్ సైట్లను టీటీడీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా భక్తులకు మరో సూచన చేసింది. శ్రీవారి దర్శనం, టికెట్లు ఇప్పిస్తామని చెబుతూ మోసం చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పెద్దింటి ప్రభాకరాచార్యులు పేరుతో వైష్ణవ యాత్రాస్ అనే ఫేస్ బుక్ పేజీని రన్ చేస్తున్న వ్యక్తి అభిషేకం టికెట్లు, ఆర్జిత సేవలు, స్పెషల్ దర్శనం పేరుతో టికెట్లు ఇప్పిస్తామని ప్రచారం చేయడం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు, నఖిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు.






